ధార్మిక సంస్థలు, పేదల సంక్షేమం కోసం కేటాయించిన వక్ఫ్ భూములు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్యాక్రాంతం అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు పూర్తిగా నిషేధం. ఇప్పటికై నా అధికారులు స్పందించి జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి. భూములపై జాయింట్ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తేనే రూ. కోట్లాది విలువగల ప్రజల ఆస్తులు భవిష్యత్ తరాలకు మిగులుతాయి.
– అఫ్జల్ మోహియొద్దీన్ (అధ్యక్షుడు, ఇస్లామియా ఓల్డ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ, వరంగల్)


