దాడుల వీడియోలు చూసే తీరిక ఉండదా..? | - | Sakshi
Sakshi News home page

దాడుల వీడియోలు చూసే తీరిక ఉండదా..?

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

రఘునాథపల్లి: ‘ఢిల్లీలో విద్యార్థులపై అమానుషంగా పోలీసులు దాడులు చేస్తే,, వీడియోలు చూసే సమయం లేదని కొందరు పెద్దలు అంటున్నారు. మరి దేనికి సమయం ఉంది. కార్పొరేషన్లకు మేలు చేసేందుకా’..? అని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో జరిగిన పార్టీ జిల్లాస్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల సమస్యపై దేశం మొత్తం అల్లాడుతుంటే..పట్టించుకునే తీరిక ఉండదా అని అన్నారు. నీట్‌ పేపర్‌ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 12 ఏళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో విసిగిపోయిన యువత ఉద్యోగాలు రాక అసహనం నుంచి పుట్టుకొచ్చిందే కాక్రోచ్‌ జనతా పార్టీ అన్నారు. నిజంగా మీకు శ్రీరాముడిపై భక్తి ఉంటే,, ఇప్పటికై నా ప్రజలకు మంచి చేయాలన్నారు. కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల వ్యక్తిగత దూషణలు సబబు కాదని, సమస్య పక్కదారి పట్టించేందుకే ఈ రాజకీయమని పేర్కొన్నారు. కాళేశ్వరం సంబంధించి టెక్నికల్‌ సమస్య ఉందని, తాము కూడా చూశామన్నారు.. అయినా నీళ్లు కావాలని,, సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి బ్యారేజీలు కొట్టుకుపోకుండా హైదరాబాద్‌కు తాగునీరు, రైతులకు సాగు నీరందించేందుకు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో అవకాశవాదులు ఉన్నారని, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు. వందేళ్ల సీపీఐలో నీతి, నిజాయితీగా ధర్మంగా పార్టీ కార్యకర్తలు ఎర్రజెండాతో పని చేస్తున్నారన్నారు. పార్టీ మండల కార్యదర్శి కావటి యాదగిరి అధ్యక్షతన జరిగిన తరగతుల్లో మాజీ ఎమ్మెల్యే, జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రాజారెడ్డి, రాష్ట్ర నాయకులు ఇట్టబోయిన ఉమామహేష్‌, ఆది సాయన్న, పాతూరి సుగుణమ్మ, ఆకుల శ్రీనివాస్‌, కందుకూరి మల్లేశం, సోమయ్య, సోమయ్య, రమేష్‌, శ్రీశైలం, సదానందం, కుమారస్వామి, యాదలక్ష్మి, ప్రశాంత్‌రెడ్డి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement