హన్మకొండ: నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీకి బాధ్యుడిగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం హనుమకొండ గోకుల్ కూడలిలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మోదీ హఠావో.. దేశ్‌కీ బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. ఢిల్లీలో విద్యార్థుల ధర్నాకు మద్దతుగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. నీట్ పరీక్ష విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ మాట్లాడుతూ.. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థినులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. కార్యక్రమంలో నాయకులు మొట్టె యామిని, కొమురమ్మ, రహీమన్నీసా, లలితా, స్వరూప, కవిత, కృష్ణవేణి, జ్యోతి. ప్రశాంతి, నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, బంక చంద్ర శేఖర్, కిశోక్, కేతిడి దీపక్‌రెడ్డి, రెండ్ల శ్రీనివాస్, అనిల్, ఎండీ.కరీం, పూరెళ్ల రవి కిరణ్, నేహాల్ పాల్గొన్నారు.
విద్యార్థుల జీవితాలతో
కేంద్రం చెలగాటం
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు
ఎర్రబెల్లి స్వర్ణ


