ప్రత్యామ్నాయ పంటల హ్యాండ్‌బుక్‌ భేష్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటల హ్యాండ్‌బుక్‌ భేష్‌

Jul 25 2026 1:17 AM | Updated on Jul 25 2026 1:17 AM

జనగామ రూరల్‌: ఎల్‌నినో ప్రభావ నివారణకు ప్రత్యామ్నాయ పంటల అమలుకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా వినూత్న రీతిలో శ్రీకారం చుట్టా రు. ఎల్‌నినో కాంటింజెన్సీ హ్యాండ్‌బుక్‌ను రూపొందించి దీని ఆధారంగా జిల్లాలో విసృత అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీతెలంగాణ వ్యవసాయ అత్యవసర – ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక వానాకాలం 2026్ఙ హ్యాండ్‌బుక్‌ను సచివాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జనగామ జిల్లాలో తొలిసారిగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మంచి పుస్తకాన్ని రూపొందించిన కలెక్టర్‌ను అభినందించారు. రైతాంగానికి మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం ఇతర జిల్లాలకు సైతం ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో 35శాతం వర్షాభావం కారణంగా వరి, పత్తి పంటల సాగులో ఏర్పడిన 52,435 ఎకరాల లోటును ప్రత్యామ్నాయ వర్షాధార పంటలతో భర్తీ చేసేందుకు కలెక్టర్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 31 నాటికి లక్ష్య సాధనలో జూలై 18 నాటికి నమోదైన 6,866 ఎకరాల 13.1శాతం ప్రగతి నుంచి మిగిలిన 45,569 ఎకరాల్లో ఆగస్టు 31 నాటికి విత్తనాలు వేసేలా కలెక్టర్‌ రోజువారీ కార్యాచరణను ఖరారు చేశారు. కార్యక్రమంలో ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌, ఎల్‌నినో కమిటీ చైర్మన్‌ జి. చిన్నారెడ్డి, వ్యవసాయ సంచాలకుడు బి.గోపి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని పాల్గొన్నారు.

జనగామ కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాను అభినందించిన మంత్రి తుమ్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement