మహబూబాబాద్: భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూ రీసర్వే చేస్తున్నట్లు రాష్ట్ర రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఖమ్మం కలెక్టరేట్ నుంచి భూ రీ సర్వే, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి అమలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి భూభారతిలో అవకాశం కల్పించినట్లు తెలిపారు.నిధులు విడుదలైనా పనులు చేపట్టని ప్రాంతాల్లో అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వీసీలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహాశబరీష్, అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి


