డీడీఎన్‌ జిల్లా అధ్యక్షుడిగా చక్రధరాచార్యులు | - | Sakshi
Sakshi News home page

డీడీఎన్‌ జిల్లా అధ్యక్షుడిగా చక్రధరాచార్యులు

Jul 12 2026 12:59 AM | Updated on Jul 12 2026 12:59 AM

డీడీఎన్‌ జిల్లా అధ్యక్షుడిగా చక్రధరాచార్యులు ‘సర్‌’ ప్రక్రియలో ప్రభుత్వం విఫలం

మహబూబాబాద్‌ రూరల్‌: తెలంగాణ ధూప దీప నైవేద్య (డీడీఎన్‌) అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడిగా అనంతాద్రి దేవస్థాన ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రం శివారులోని అనంతాద్రి దేవస్థానంలో శనివారం నిర్వహించిన జిల్లా డీడీఎన్‌ అర్చకుల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈసందర్భంగా చక్రధరాచార్యులు మాట్లాడుతూ జిల్లాలోని డీడీఎన్‌ అర్చకులందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గొడవర్తి చక్రధరాచార్యులును సమావేశంలో పాల్గొన్న అర్చకులు, పలువురు ప్రముఖులు సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారు సముద్రాల లక్ష్మీనరసింహాచార్యులు, గౌరవ అధ్యక్షులు కృష్ణమాచార్యులు, వేంకటేశ్వరాచార్యులు, సత్యశ్రీనివాస్‌, బొల్లోజు శ్రీనివాసాచార్యులు, వేణుగోపాలాచార్యులు, సుదర్శనాఆచార్యులు పాల్గొన్నారు.

యంగ్‌ ఇండియా ప్రవేశ పరీక్ష

మహబూబాబాద్‌ అర్బన్‌: కస్తూర్భా గాంధీ విద్యాలయంలో యంగ్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలో ఆరో తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ సత్యనారాయణమూర్తి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహబూబాబాద్‌, గూడూరు, బయ్యారంలో కేజీబీవీలో నేడు (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ప్రతీ కేజీబీవీలో 20 సీట్ల చొప్పున మొత్తం 60 సీట్లు ఉంటాయని, ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 213 మంది విద్యార్థినులు హాజరవుతారని తెలిపారు.

నిట్‌ను సందర్శించిన తైవాన్‌ ప్రొఫెసర్ల బృందం

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ను శనివారం నేషనల్‌ తైవాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ చెంగ్‌ చూన్‌ హీ తన బృందంతో సందర్శించారు. నిట్‌ వరంగల్‌ అధ్యాపకులతో కార్బన్‌ డై ఆకై ్సడ్‌ వ్యర్థాల నుంచి ఉపయోగకరమైన స్వచ్ఛ ఇందనంగా మార్చే నూతన సాంకేతికతలపై, పరిశ్రమల నుంచి వెలువడే కార్డన్‌ను తగ్గించడంపై పరిశోధనల గురించి చర్చించారు. ఈసందర్భంగా నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ తైవాన్‌ ప్రొఫెసర్ల బృందానికి కాకతీయ తోరణ జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ లీలా మనోహర్‌ ఏశాల, రాజేశ్‌ఖన్నా గడ్డం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్‌ అర్బన్‌: ‘సర్‌’ కార్యక్రమంలో జిల్లా ఉన్నత అధికారులు పోలింగ్‌ బూత్‌ వారీగా పర్యటనలు, బీఎల్‌ఓల ఏర్పాటులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభూ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సర్‌’ కార్యక్రమంలో ఓట్ల జాబితాలో అవకతవకలు జరగకుండా ఉండాలంటే జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బీజేపీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు గడపగడపకు వెళ్లి ప్రజలకు బీజేపీ విధానాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఒద్దిరాజు రామచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకటి మహేష్‌, గడ్డం అశోక్‌కుమార్‌, మదన్‌లాల్‌, జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, నర్సింహరెడ్డి, పద్మావతి, రేష్మా, కార్యదర్శులు సతీష్‌, హిందూభారతి, అశోక్‌, మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు సరోజ, బీజీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దాసరి మురళీ, దళిత మోర్చా అధ్యక్షుడు బోడ వెంకన్న, గిరిజన మోర్చా అధ్యక్షుడు సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement