మానుకోట @ 30 | - | Sakshi
Sakshi News home page

మానుకోట @ 30

Jul 12 2026 12:59 AM | Updated on Jul 12 2026 12:59 AM

సాక్షి, మహబూబాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల పనితీరు పరిశీలించి మరింత మెరుగ్గా విద్యా బోధన అందించేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నిర్వహించిన పాఠశాలల పనితీరు నివేదిక ప్రామాణికంగా లెక్కిస్తారు. గత విద్యాసంవత్సరం 2025–26 కు సంబంధించిన పర్‌ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌(పీజీఐడీ) నివేదికలో తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్‌ జిల్లా 30వ స్థానంలో నిలిచింది.

ఆరు అంశాలకు మార్క్‌లు

పాఠశాలల సమగ్ర స్వరూపం తెలుసుకునేందుకు నిర్వహించిన పీజీఐడీ రిపోర్టులో మొత్తం 600 చేసి లెక్కించారు. ఇందులో అభ్యసనా ఫలితాలు, పాఠశాలల్లో అభ్యసన ప్రక్రియ, మౌలిక వసతులు, విద్యార్థుల భద్రత, రక్షణ, డిజిటల్‌ బోధన అమలు తీరు, పాలనా ప్రక్రియ ఇలా ఆరు అంశాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా అభ్యసనా ఫలితాలకు 290 మార్కులు కేటాయించగా భద్రత, రక్షణ వంటి అంశాలకు 35 మార్కులు కేటాయించారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీజీఐడీ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఆరు అంశాలు కలిపి మొత్తం 600 మార్కులకు గాను ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ జిల్లా 383 మార్కులు సాధించి ఉత్తమ్‌–3గా ఎంపిౖకైంది. మహబూబాబాద్‌ 30వ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లా 32వ స్థానానికి పరిమితమైంది.

నిర్ణయించిన మార్కులు వచ్చిన మార్కులు

అంశాలు, సాధించిన మార్కులు

పీజీఐడీ –2025–26 నివేదికలో జిల్లా స్థానం

పాఠశాలల పనితీరుపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ గ్రేడింగ్‌

పరిగణనలోకి ఆరు అంశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement