సాధారణంగా జూలై మాసంలో వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలతోపాటు బావుల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభమై సుమారు రెండు నెలలు కావస్తున్నా.. ఒక్కసారికూడా భారీ వర్షం కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. వానాలు లేకపోవడం.. గంగమ్మ పాతాళానికే పరిమితం కావడంతో అన్నదాతల సాగుఆశలు ఆవిరవుతున్నాయి. నీరులేక రైతులు సాగు చేయలేకపోతున్నారనడానికి నిదర్శనమే.. మహబూబాబాద్ మండలంలోని ఇస్లావత్ తండా జీపీ పరిధి తేజావత్ తండాకు చెందిన తేజావత్ ఉమకు చెందిన ఈ బావి. – మహబూబాబాద్ రూరల్


