హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల ఆలయంలో సోమవారం ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, గణపతిపూజ, స్వామివారికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం రుద్రేశ్వర శివలింగాన్ని శివముఖంతో అలంకరించి వివిధ వర్ణాలతో లేపనం చేశారు.
నేడు దేవాలయం మూసివేత
చంద్రగ్రహణం ఉన్నందున వేయిస్తంభాల దేవాలయాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణి కోట అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి బుధవారం ఉదయం సంప్రోక్షణలు పూజలు నిర్వహించి ఆలయాన్ని భక్తుల దర్శనార్థం అనుమతించనున్నట్లు తెలిపారు.


