దొంగలు దొరికేదెన్నడు? | - | Sakshi
Sakshi News home page

దొంగలు దొరికేదెన్నడు?

Mar 3 2026 8:23 AM | Updated on Mar 3 2026 8:23 AM

జిల్లాలో పెరుగుతున్న చోరీలతో జనం బెంబేలు భయాందోళనకు గురవుతున్న ప్రజలు

మహబూబాబాద్‌ రూరల్‌:

గతేడాది ఆగస్టు మాసంలో జిల్లా కేంద్రంలోని రామచంద్రపురం కాలనీలో ఓ వ్యక్తి ఇంట్లో చోరీ జరిగి ఏడున్నర తులాల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలు, రూ.15 వేల నగదు దొంగిలించారు. ఈ చోరీ ఘటన జరిగి ఏడు నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు కేసులో పురోగతి కనిపించలేదు.

లా జిల్లా వ్యాప్తంగా దొంగతనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. దొంగలు దొరకపోవడం, రికవరీలు జరగకపోవడంతో బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న చో రీలతో జనం బేంబేలెత్తుతుండగా పట్టపగలే చోరీలు జరుగుతుండడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. దీంతో పండుగలు, విశేష సందర్భాలు, ఇతర శుభకార్యాలకు వెళ్లాలంటేనే ఆలో చించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పే ర్కొంటున్నారు. ఏదైనా ఊరికి వెళ్లిన సమయంలో పక్కింటి వారికి చెప్పి వెళ్లినా.. దొంగలు ఎలాంటి శ బ్ధాలు రాకుండా చోరీలకు పాల్పడుతున్నారని ఆరో పిస్తున్నారు. దొంగతనాల రికవరీలు చేయటంతో పాటుగా చోరీల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దొంగతనాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

47.91 శాతం మాత్రమే రికవరీ

జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంలో జరిగిన చోరీల్లో యాభై శాతం మాత్రమే రికవరీ జరిగాయి. మిగిలిన చోరీ కేసులు అలాగే ఉండిపోయాయి. 2025 సంవత్సరంలో సాధారణ దొంగతనాల కేసులు 148 నమోదు కాగా పగటిపూట జరిగిన ఇంటి దొంగతనాల కేసులు 36 నమోదయ్యాయి. రాత్రిపూట జరిగిన ఇంటి దొంగతనాల కేసులు 76 నమోదు కాగా రాబరీ కేసులు 3 నమోదు చేయబడగా మొత్తం ప్రాపర్టీ కేసులు 263 కాగా 126 కేసులు పరిష్కారమవగా మొత్తంగా 47.91 శాతం మాత్రమే రికవరీ జరిగింది. జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంలో మొత్తం ఆస్తి నష్టం విలువ రూ.2,25,64,477 కాగా రూ.1,13,80,455 విలువ గల ఆస్తి రికవరీ చేశారు. జిల్లా పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది దొంగతనం కేసుల నియంత్రణతోపాటు, ఆస్తి రికవరీ విషయంలో పురోగతిలో కొంతమేరకు వెనుకబడ్డట్లు కనిపిస్తుంది.

రెండు నెలల్లో తొమ్మిది చోరీలు

మానుకోట పట్టణంలో ఈ ఏడాది రెండు నెలల కాలంలో తొమ్మిది దొంగతనాలు జరగగా కేవలం ఒకటి మాత్రమే రికవరీ జరిగింది. మిగిలిన కేసులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన చోరీ కేసులు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఎప్పుడు రికవరీ జరుగుతుందోనని బాధితులు ఎదురుచూస్తున్నారు.

మూడు రోజులైనా కేసు నమోదు చేయలె..

మానుకోట పట్టణంలోని ఓ వ్యక్తి ఇంట్లో ఫిబ్రవరి 27వ తేదీ అర్ధరాత్రి చోరీ జరిగి మూడు తులాల బంగారు, వెండి ఆభరణాలు అపహరణకు గురికాగా బాధితులు 28వ తేదీ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి మూడు రోజులైనప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. కేసు నమోదు కోసమని వెళ్తే మేమే ఫోన్‌ చేసి పిలుస్తామని చెప్పారని కేసు నమోదు అవుతుందోలేదోనని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

2025లో జరిగిన దొంగతనాల వివరాలు

సీసీఎస్‌, సివిల్‌ పోలీసుల మధ్య సమన్వయలోపం?

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు జరిగిన సందర్భాల్లో ఆయా పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల అధికారులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ అవి పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్న నేపద్యంలో సీసీఎస్‌, సివిల్‌ పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణమని తెలుస్తుంది.ఎక్కడ చోరీ జరిగినా సీసీఎస్‌ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించాలని సివిల్‌ పోలీసు అధికారులు చెబుతుండగా ఇందుకు భిన్నంగా వారి వ్యవహార శైలి ఉంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో నమోదైన కేసుల్లో రికవరీల శాతం తగ్గిందని, కేసుల పరిష్కారంలో పురోగతి ఉండాలని జిల్లా పోలీసు బాస్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement