కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

మహబూబాబాద్‌: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు మాలోత్‌ కవిత అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని పూలే జంక్షన్‌ నుంచి ఇందిరాగాంధీ సెంటర్‌ వరకు నిరసన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు సీఎం రేవంత్‌రెడ్డి బొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్‌ కవిత మాట్లాడుతూ.. అక్రమ కేసులకు భయపడేదిలేదని, ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో మాజీ సీఎంకు సిట్‌ నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ సాధకుడు కేసీఆర్‌ అని కొనియాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలు మానుకొని, ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను అరెస్ట్‌ చేస్తే రాష్ట్ర అగ్నిగుండంగా మారుతుందన్నారు. సిట్‌ పేరుతో ఇబ్బందులు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, ఫరీద్‌, ముత్యం వెంకన్న, నెహ్రూనాయక్‌, మురళి, రాజ్‌కుమార్‌, జంగాల విజయ్‌, కర్పూరపు గోపి, వెన్నమల్ల అజయ్‌, ఎలేందర్‌, మహబూబ్‌పాషా, సలీం తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు

మాలోత్‌ కవిత

పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మతో

శవయాత్ర, అనంతరం దహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement