మేడారం జాతరపై అసంతృప్తి | - | Sakshi
Sakshi News home page

మేడారం జాతరపై అసంతృప్తి

Feb 2 2026 7:57 AM | Updated on Feb 2 2026 7:57 AM

మేడారం జాతరపై అసంతృప్తి

మేడారం జాతరపై అసంతృప్తి

వీఐపీల కారణంగానే మంత్రి సీతక్క వివరణ

ఏటూరునాగారం: ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఈసారి ప్రభుత్వ ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయని భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘చిన్న చిన్న ఇబ్బందులే’ అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం వాస్తవ పరిస్థితులకు పూర్తిగా భిన్నమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్‌నియంత్రలో అధికారుల సమన్వయంతో పూర్తిగా కుప్పకూలింది. అధికారులను దారిలో పెట్టాల్సిన మంత్రులే వారితో ఫ్రెండ్లీగా ఉండడంతో కేవలం మంత్రుల మెప్పుకోసం పనిచేసినట్లుగా హడావుడి చేశారే తప్పా భక్తుల వరకు వారి సేవలు వెళ్లలేదు. జిల్లా ఎస్పీ స్థాయి అధికారి భక్తుల ట్రాఫిక్‌, దర్శనాల సమస్యలు చూడకుండా కేవలం గద్దెల వద్ద జరుగుతున్న అభివృద్ది పనులపై రాత్రింబవళ్లు దృష్టి పెట్టారని, భక్తుల దర్శనాలు, రవాణా విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని నెటిజన్లు విమర్శలను గుప్పిస్తున్నారు.

అనుభవం లేని యంగ్‌ ఆఫీసర్లు

రోడ్డు మార్గాల్లో క్షేత్రస్థాయిలో ఒక్క అనుభవజ్ఞుడైన అధికారి కూడా సమర్థవంతంగా పని చేయలేదని ఆరోపణలున్నాయి. అమ్మవార్లను తీసుకొచ్చే సమయంలో మాత్రం పదుల సంఖ్యలో యంగ్‌ పోలీస్‌ అధికారులు కనిపించారని, గద్దెల చుట్టూనే హడావుడి పరిమితమైందని భక్తులు విమర్శిస్తున్నారు. గతంలో రోడ్లను సెక్టార్లుగా విభజించి, ప్రతీ సెక్టార్‌కు ఒక అధికారి నియమించేది. కానీ ఈసారి ట్రాఫిక్‌ నియంత్రణ, రోడ్డు భద్రతకు సరైన ఇన్‌చార్జ్‌లను వేయకపోవడంతో ట్రాఫిక్‌ను గాలికి ఒదిలేశారు.

మంత్రుల ఆర్భాటాలే...

వసతులపై నిర్లక్ష్యం?

గద్దెల అభివృద్ధిపై చూపెట్టినంత శ్రద్ధ భక్తుల వసతులపై పెట్టలేదని భక్తులు బాహాటంగా చెబుతున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ ఉన్నప్పటికీ భక్తుల సౌకర్యాలు కల్పన విషయంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించలేదని దీనిని బట్టి తెలుస్తోంది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే తప్ప భక్తుల సమస్యలు పరిష్కారం కానరాలేదు. వీవీఐపీలకు దర్శనాలు చేయించేందుకు పోలీసులు ఎక్కువ సమయం కేటాయించారు. పదుల సంఖ్యలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ వద్ద ఉంటూ వచ్చిన వీవీఐపీలకు భద్రత కల్పించి దర్శనాలు చేయించేరా తప్ప సామాన్య భక్తుల దర్శనం దృష్టి పెట్టలేదు.

ప్రభుత్వం, మంత్రి సీతక్కకు

వ్యతిరేకంగా భక్తుల నినాదాలు

అనుభవం లేని అధికారులతో

కుప్పకూలిన ట్రాఫిక్‌

మంత్రుల ఆర్భాటం.. క్షేత్రస్థాయిలో లోపించిన పనులు

ఆదివారం మేడారంలో బస్సులు లేక భక్తుల అవస్థలు

కానరాని ఆర్టీసీ సేవలు

మేడారం సమ్మక్క,సారలమ్మను ఆదివారం దర్శించుకున్న వేలాది మంది భక్తులు తిరుగు ప్రయాణం చేసే క్రమంలో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. బస్సుల్లో వచ్చిన భక్తులను ఇక్కడ దిగబెట్టి బస్సులను వెనక్కి పంపించారని, ఆర్టీసీ సేవలు ఈ జాతరలో పూర్తిగా విఫలం అయ్యాయని భక్తులు వాపోయారు.

వీఐపీల కారణంగానే మేడారంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తిందని మంత్రి సీతక్క శనివారం రాత్రి జరిగిన సమావేశంలో మీడియాకు వెల్ల డించారు. ఒక్కో వీఐపీ సుమారు 50 వాహనాలను తీసుకొచ్చారని, దీని ద్వారా బస్సులను ఆపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సమస్య మొదలైందని పేర్కొన్నారు. పాసులు పదివేల లోపు జారీ చేసినప్పటికీ కొంత మంది సొంతంగా ముద్రలు వేసుకొని వచ్చారనన్నారు. వీఐపీలు 200 మందిని తీసుకువచ్చారన్నారు. వారి వాహనాల కారణంగానే ఇబ్బంది వచ్చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement