మూగజీవాల మృత్యువాత
మహబూబాబాద్ రూరల్ : విద్యుదాఘాతంతో మూడు జీవాలు మృత్యువాతపడిన ఘటన మహబూబాబాద్ పురపాలక సంఘం మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని దామ్యతండా గ్రామపంచాయతీకి చెందిన బానోత్ శ్యామ్ తన ఆవును ఉదయం మేత కోసం విడిచిపెట్టాడు. బానోత్ లింగ్య బావి సమీపంలోని స్తంభానికి ఉన్న విద్యుత్ వైరు తెగివుండడంతో ఆవుకు ఆ వైరు తగిలి కరెంటు షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో బాధిత రైతుకు రూ.70 వేలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. అనంతారం గ్రామ శివారు కంది పప్పు మిల్లు పక్కన విద్యుత్ విద్యుత్ వైర్లు తెగిఉండి అటువైపుగా మేతకు వెళ్ళిన రెండు పాడిగేదెలు విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాయి. మహబూబాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన గుగులోతు నరేందర్ తన పాడిగేదెలను మేతకోసమని అనంతారం గ్రామం పరిధిలోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అనంతారం గ్రామ శివారు కంది పప్పు మిల్లు ప్రాంతానికి రెండు పాడిగేదెలు వెళ్లగా కిందపడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడిక్కడే మృతిచెందాయి. దీంతో బాధిత రైతుకు రూ.2.50 లక్షలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.
వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో
మూడు మృతి
మూగజీవాల మృత్యువాత


