28న వరంగల్‌కు సీఎం రేవంత్‌ | - | Sakshi
Sakshi News home page

28న వరంగల్‌కు సీఎం రేవంత్‌

Jun 25 2024 1:36 AM | Updated on Jun 25 2024 1:36 AM

28న వరంగల్‌కు సీఎం రేవంత్‌

28న వరంగల్‌కు సీఎం రేవంత్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ నెల 28న వరంగల్‌ నగరానికి రానున్నారు. ఈ మేరకు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సోమవారం సాయంత్రం సమాచారం అందినట్లు తెలిసింది. 28న ఉదయమే హనుమకొండకు చేరుకోనున్న ముఖ్యమంత్రి కలెక్టరేట్‌లో పలు అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. గ్రేటర్‌ వరంగల్‌కు సంబంధించి మాస్టర్‌ ప్లాన్‌ – 2041, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, ఎంజీఎం ఆస్పత్రి, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, ఔటర్‌రింగ్‌ రోడ్డు, స్మార్ట్‌ సిటీ పనులపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష జరిపే అవకాశం ఉంది. ఆ తర్వాత హనుమకొండ హంటర్‌ రోడ్డులోని నిర్మాణం పూర్తయిన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ప్రారంభంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సమయానుకూలతను బట్టి నయీంనగర్‌ వంతెన నిర్మాణం పనులను కూడా పరిశీలించే అవకాశం ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement