నామినేషన్ల ప్రక్రియ షురూ! | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల ప్రక్రియ షురూ!

Apr 19 2024 1:35 AM | Updated on Apr 19 2024 1:35 AM

కలెక్టరేట్‌లోని ఆర్‌ఓ కార్యాలయంలో 
నామినేషన్లు దాఖలు చేస్తున్న బుద్దయ్య - Sakshi

కలెక్టరేట్‌లోని ఆర్‌ఓ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేస్తున్న బుద్దయ్య

కాళోజీ సెంటర్‌ : లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. వరంగల్‌ ఎస్సీ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారి, వరంగల్‌ కలెక్టర్‌ పి.ప్రావీణ్య తెలిపారు. అలయన్స్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ (రిజిస్టర్డ్‌ పార్టీ) అభ్యర్థిగా అంబోజు బుద్దయ్య, ఇండిపెండెంట్‌(స్వతంత్ర)అభ్యర్థిగా బరిగెల శివ, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(రిజిస్టర్డ్‌ ఆన్‌ రికగ్నైజ్డ్‌) పార్టీ అభ్యర్థినిగా తౌటపల్లి నర్మదా ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ వేశారని రిటర్నింగ్‌ అధికారి కలెక్టర్‌ పి.ప్రావీణ్య తెలిపారు.

వరంగల్‌ పార్లమెంట్‌ స్థానానికి మొదటి రోజు మూడు దాఖలు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement