
దంతాలపల్లి: ఆస్పత్రి సిబ్బంది పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మురళీధర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆస్పత్రిని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఆస్పత్రిలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆరాతీశారు. ఆస్పత్రిలో మెరుగైన సేవలందించి మంచిపేరు సంపాదించుకోవాలని సిబ్బందికి సూచించారు. ఎండదెబ్బపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం ఆస్పత్రిలో రిజిస్టర్లను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యురాలు చైతన్య, సీహెచ్‌ఓ బాలాజీ, ఫార్మసిస్టు రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.