
మాట్లాడుతున్న కలెక్టర్ శశాంక
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక
మహబూబాబాద్: జిల్లాలోని ప్రతీ పోలింగ్ కేంద్రంలో దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు, ర్యాంప్‌లు ఇతర ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశ మందిరంలో మంగళవారం పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులు, వయోవృద్ధుల వసతులపై డీడబ్ల్యూఓ వరలక్ష్మి, సీడీపీఓలు, సంబంధిత ఎన్నికల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పూర్తిస్థాయిలో డోర్నకల్, మానుకోట నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. రెండు నియోజకవర్గాలలో 348 లొకేషన్లలో 539 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 348 లొకేషన్లలో 348 వీల్‌చైర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల 25వ తేదీలోపు తహసీల్దార్లు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల ఆధ్వర్యంలో మండల కార్యాలయాలు, మున్సిపాలిటీలకు వీల్‌చైర్లు అందుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment