చైర్మన్‌ గిరి.. పచ్చనోట్ల కిరికిరి! | - | Sakshi
Sakshi News home page

చైర్మన్‌ గిరి.. పచ్చనోట్ల కిరికిరి!

Nov 13 2026 3:53 AM | Updated on Nov 13 2026 3:53 AM

ఎంపీపీ

పదవులకు సైతం..

జెడ్పీ చైర్మన్‌ పీఠం రేటు ఒక ఎత్తయితే ఎంపీపీ పదవులకు కూడా టీడీపీ నాయకులు కూడా బేరం పెట్టారు. ఆళ్లగడ్డ, బనగానపల్లెలో ఒక ఎంపీపీ పదవికి రూ.20–25 లక్షలకు బేరం కుదిర్చినట్లు సమాచారం.

సాక్షి, నంద్యాల: మొట్ట మొదటిసారిగా ఏర్పడనున్న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం కోసం తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాట మొదలైంది. చైర్మన్‌ పీఠం కోసం ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు జెడ్పీటీసీ సభ్యులు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరిని చైర్మన్‌ పీఠం వరిస్తుందోనన్న చర్చ నంద్యాలలో జోరు గా సాగుతోంది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవచేసిన వారిని పక్కనపెడుతూ పార్టీ ఫండ్‌ పేరిట డబ్బులు తీసుకుంటూ ఎవరినో అందలం ఎక్కిస్తున్నారని పచ్చ తమ్ముళ్లు బాధపడిపోతున్నారు. ఇటీవల మున్సిప ల్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ముఖ్యులు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ పదవులకు బేరాలు పెడుతున్నారు. జెడ్పీ చైర్మన్‌ అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించడంతో ఆశావహుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఎంత ఖర్చైనా సరే పెట్టి జెడ్పీ పీఠాన్ని తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు అధిష్టానం వద్ద వాదనలు వి నిపిస్తున్నట్లు సమాచారం. తొలి జెడ్పీ చైర్మన్‌గా తమ వారే ఉండాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీ ఫండ్‌ పేరుతో రూ.కోట్ల వసూలు?

జిల్లాల పునర్విభజన అనంతరం ఏర్పడనున్న తొలి జెడ్పీ చైర్మన్‌ పదవిని టీడీపీలోని కొందరు రాష్ట్రస్థాయి నాయకులు అంగట్లో సరుకుల్లా రూ.14 కోట్లతో అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. జెడ్పీ పీఠం కోసం వెలుగోడు జెడ్పీటీసీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికై న గుండం రమణారెడ్డి పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. పార్టీ ఏర్పాటు నుంచి టీడీపీలోనే కొనసాగుతూ వస్తున్న రమణారెడ్డికి టీడీపీ అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు రమణారెడ్డిని చైర్మన్‌ సీటుపై కూర్చొబెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌గా ఉన్న నంద్యాల మండలానికి చెందిన తాతిరెడ్డి తులసిరెడ్డిని అంతకుముందు బండిఆత్మకూరు జెడ్పీటీసీగా పోటీ చేయించారు. తులసిరెడ్డిని జెడ్పీ చైర్మన్‌ను చేయాలన్న ఉద్దేశంతో అన్ని రకాల ప్రయత్నాలు చేసినా వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి దేశం వెంకటరామిరెడ్డి చేతిలో తులసిరెడ్డి ఘోర పరాభవాన్ని చవిచూశారు. దీంతో ఎమ్మెల్యే పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. తన నియోజకవర్గంలోని వెలుగోడు జెడ్పీటీసీ అయిన రమణారెడ్డిని చైర్మన్‌ సీటులో కూర్చోబెట్టాలనుకొనే ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.

● ఆళ్లగడ్డ జెడ్పీటీసీగా గెలుపొందిన పోరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సైతం చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. ఈయన స్థానిక ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సహకారంతో చైర్మన్‌ గిరి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రూ.కోట్లు గుమ్మరించి జెడ్పీటీసీ ఎన్నికై న రాజశేఖర్‌రెడ్డి చైర్మన్‌ సీటు కోసం ఎందాకై నా.. అంటూ సవాల్‌ విసురుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే తో పాటు జిల్లా మంత్రులతో మాట్లాడుతూ పార్టీ ఫండ్‌ కింద పెద్ద మొత్తంలో ముట్టజెప్పేందుకు సిద్ధమన్నట్లు సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం.

● శిరువెళ్ల జెడ్పీటీసీగా ఎన్నికై న కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి సైతం చైర్మన్‌ సీటు కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న శ్రీకాంత్‌రెడ్డికి అనేక పదవులు దగ్గరగా వచ్చి దరిచేరకుండా పోయాయి. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే అఖిలప్రియ పార్టీ అధిష్టానం దష్టికి తీసుకెళ్లి తనకు ఈసారైనా పదవి వరించేలా చూడాలంటూ విన్నవించుకున్నట్లు సమాచారం.

● బేతంచెర్ల జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికై న పోలూరు రాఘవరెడ్డి జెడ్పీచైర్మన్‌ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డోన్‌ టీడీపీలో రెండో వర్గానికి చెందిన ముఖ్య నాయకుడి ద్వారా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా మంత్రుల వద్ద తనకు చైర్మన్‌ సీటు ఇప్పించాలని కోరినట్లు సమాచారం. ఏది ఏమైనా చైర్మన్‌ సీటుకు పోటీ నలుగురి మధ్యనే కాకుండా మరో ఇరువురు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోటీ తీవ్రత ను బట్టి పార్టీ ఫండ్‌ పెరగనున్నట్లు సమాచారం.

జెడ్పీ చైర్మన్‌ కోసం

టీడీపీలో కుమ్ములాటలు

పోటీలో నలుగురు జెడ్పీటీసీ సభ్యులు

పార్టీ ఫండ్‌ పేరుతో

రూ.కోట్లు కొల్లగొట్టనున్న ముఖ్యులు

తమ వర్గానికి చైర్మన్‌ గిరి

ఇప్పించుకునేందుకు

ఎమ్మెల్యేల పైరవీలు

చైర్మన్‌ సీటు కోసం ఎందాకై నా

అంటున్న ఆళ్లగడ్డ జెడ్పీటీసీ సభ్యుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement