ఫుడ్‌ టెక్నాలజీపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ టెక్నాలజీపై అవగాహన అవసరం

Nov 3 2026 1:45 AM | Updated on Nov 3 2026 1:45 AM

● ఆర్‌యూ వైస్‌చాన్స్‌లర్‌

ఆచార్య వి.వెంకట బసవరావు

కర్నూలు కల్చరల్‌: ఫుడ్‌ టెక్నాలజీ కోర్సుకు సంబంధించిన ఆధునిక విషయాలపై విద్యార్థులు అవగాహన అవసరమని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్‌ ఆచార్య వి.వెంకట బసవరావు అన్నా రు. వర్సిటీ లైఫ్‌ సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో వర్సిటీ సెనేట్‌ హాలులో సోమవారం నిర్వహించిన సదస్సును వీసీ ప్రారంభించి ప్రసంగించారు. ఆహార సంరక్షణ, ప్రాసెసింగ్‌, ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలు మొదలైన విషయాలపై నిపుణులు అందించే సూచనలను తెలుసుకోవాలని సూచించారు. సమస్త జీవజాతికి ఆహారం ఎంతో అత్యవసరమైందని, ఈ మేరకు మన సంప్రదాయ విధానాలతో పాటు, ఆధునిక పరిశోధనల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. డీన్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఆచార్య ఆర్‌. భరత్‌కుమార్‌ అఽధ్యక్షతన జరిగిన సదస్సులో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పరిశోధకులు ఆచార్య ఎం. శ్రీనివాస్‌, ఆచార్య వి. భాస్కర్‌ ముఖ్య వక్తలుగా హాజరై ఆహార శాస్త్రం, ఆహార సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న ఆధునిక పరిణామాలగురించి వివరించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య బి. విజయకుమార్‌ నాయుడు, వర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్‌ ఆచార్య సి. విశ్వనాథ రెడ్డి, వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య సుందరానందపుచ్చ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement