గాజులపల్లెలో వ్యక్తి కిడ్నాప్‌ | - | Sakshi
Sakshi News home page

గాజులపల్లెలో వ్యక్తి కిడ్నాప్‌

Nov 3 2026 1:45 AM | Updated on Nov 3 2026 1:45 AM

మహానంది: గాజులపల్లె గ్రామానికి చెందిన సంసాని రంగయ్య ఆలి యాస్‌ స్వామి రంగయ్య కిడ్నాప్‌నకు గురైనట్లు మహానంది ఎస్‌ఐ ఎల్‌.శివాంజల్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గాజులపల్లె గ్రామంలో ఉంటున్న రంగయ్య, ఆయన భార్య భజన కార్యక్రమానికి వెళ్లి తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటికి వచ్చారన్నారు. సుమారు 6 గంటల ప్రాంతంలో ఆరుగురు వ్యక్తులు వచ్చి తన భర్త రంగయ్యను బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆయన భార్య పెద్ద పుల్లమ్మ ఫిర్యాదు చేసిందన్నారు. ఇదిలా ఉండగా రంగయ్య టీటీడీ, ఇతర సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్లు గతంలో పోలీసుల దృష్టికి కొందరు తీసుకెళ్లినట్లు సమాచారం. అందులో భాగంగానే బాధితుల్లో ఎవరైనా ఇచ్చిన డబ్బుల కోసం తీసుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రంగయ్య భార్య పెద్దపుల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement