ఆధ్యాత్మిక వెలుగులు ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక వెలుగులు ఎక్కడ?

Nov 3 2026 1:45 AM | Updated on Nov 3 2026 1:45 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల ఆలయంలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతూ భక్తులను ఆకట్టుకున్న సౌండ్‌ అండ్‌ లైట్స్‌ షో గత రెండేళ్లుగా నిలిచిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రారంభించిన కొద్ది కాలంలోనే అటకెక్కడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. శ్రీశైల దేవస్థా నంలో భక్తుల సౌకర్యార్థం పలు సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. 2017లో కేంద్ర ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి ప్రసాద్‌ పథకం ద్వారా సుమారు రూ.43 కోట్లు విడుదల చేసింది. కేంద్ర పర్యాటక శాఖ ‘పిలిగ్రిమేజ్‌ రెజువెనేషన్‌ అండ్‌ స్పిర్చువల్‌ అగ్మెంటేషన్‌ డ్రైవ్‌’ (ప్రసాద్‌) పథకం కింద శ్రీశైల క్షేత్రంలో భక్తులకు, పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులు మంజూరు చేసింది. మూడు విడతలుగా నిధులు విడుదలయ్యాయి. 2017లో శ్రీశైలంలో ప్రసాద్‌ పథకం ద్వారా పనులు ప్రారంభించారు. కేంద్రం మంజూరు చేసిన పనులను రాష్ట్ర పర్యాటక శాఖ, శ్రీశైల దేవస్థాన ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో చేపట్టారు. కేంద్రప్రభుత్వ ప్రసాద్‌ స్కీం ద్వారా ప్రధాన ఆలయంలో సుమారు రూ.6 కోట్లతో సౌండ్‌ అండ్‌ లైట్‌ షో ఏర్పాటు చేశారు. సుమారు 40 నిమిషాల నిడివి గల ఈ ప్రదర్శనలో జ్యోతిర్లింగ క్షేత్రాల విశిష్టత, అష్టాదశ శక్తిపీఠాల పరిచయం, శ్రీశైలక్షేత్ర ప్రాశస్త్యం, శ్రీశైల చారిత్రక విశిష్టతో పాటు శ్రీశైలానికి సంబంధించిన వివిధ రకాల చరిత్రల విశేషాలు మొదలైన అంశాలతో ఈ ప్రదర్శనను రూపొందించారు. 2022 డిసెంబరు 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ పథకం ద్వారా క్షేత్రంలో నిర్మించిన అన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా సౌండ్‌ అండ్‌ లైట్‌ షో కూడా ఉంది. ఈ షో ప్రారంభించిన కొన్ని నెలలకు అమ్మవారి ఆలయం వెనుక ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి టికెట్లు విక్రయించి షోను నిర్వహించారు. అయితే సౌండ్‌ అండ్‌ లైట్స్‌ షో కాంట్రాక్టర్‌కు టూరిజం శాఖ పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్‌ సౌండ్‌ అండ్‌ లైట్స్‌ షోకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను తనతో పాటు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో గత రెండేళ్లుగా శ్రీశైల ఆలయంలో సౌండ్‌ అండ్‌ లైట్‌ షో నిలిచినా దేవస్థానం అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. ఓ వైపు భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెబుతున్నారే కానీ.. రోజురోజుకు దూరమవుతున్న సేవలను గురించి అడిగేవారు లేరు.

శ్రీశైలంలో నిలిచిన

‘సౌండ్‌ అండ్‌ లైట్స్‌ షో’

కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ పథకంలో

భాగంగా రూ.6 కోట్లతో ఏర్పాటు

బిల్లులు చెల్లించకపోవడంతో

సాఫ్ట్‌వేర్‌ను అప్పగించని కాంట్రాక్టర్‌

రెండేళ్లుగా షో నిలిచినా

పట్టించుకోని దేవస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement