ఎమ్మిగనూరులో పచ్చ పార్టీ అక్రమాలకు పాల్పడింది. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మున్సిపాలిటీలోని 26, 10 వార్డులలో పచ్చ పార్టీ నేతలు దొంగ ఓట్లు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న రాజీవ్ రెడ్డి ఇంటి నుంచి పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకున్నారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి తరలిరావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రాజీవ్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 26వ వార్డులో రిగ్గింగ్‌కు పాల్పడుతున్న పచ్చ పార్టీ నేత శేఖర్ జోలికి పోలీసులు వెళ్లలేదు.


