ఎమ్మిగనూరుటౌన్: వైఎస్సార్‌సీపీ నియోజక వర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డి ఎమ్మిగనూరు పట్టణంలోకి రాకుండా ఆదివారం ఉదయం గోనెగండ్ల బైపాస్‌లో పట్టణ సీఐ కంభగిరి రాముడు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థి తి నెలకొంది. మీకు పట్టణంలో ఓటు లేనందుకు రాకూడదని చెప్పగా తన తాత మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నివాసానికి వెళుతున్నానని, పోలింగ్ కేంద్రాలకు వెళ్లనని ఆయన చెప్పారు. అయినా పోలీసులు ఒప్పుకోకపోవడంతో దాదాపు గంట సేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు అక్కడికి చేరు కొని కర్నూలు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. చివరకు ఇంటిలోనే ఉండాలని నిబంధన పెట్టగా టీటీడీ నాయకులు దొంగ ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నిస్తే మాత్రం సహించనని రాజీవ్‌రెడ్డి పోలీసులకు స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం 26వ వార్డులో టీడీపీ నాయకులు దొంగఓట్లు వేసుకుంటారని తెలిసి రాజీవ్‌రెడ్డి ఆ కేంద్రానికి వెళ్లగా పోలీసులు ఆయనను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


