జూపాడుబంగ్లా: టీడీపీ ప్రభుత్వ పాలన నచ్చక తర్తూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆదివారం తర్తూరు గ్రామంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజనవిభాగ వర్కింగ్ ప్రెసిడెంటు బైరెడ్డి సిద్దార్థరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పీఎం నాగిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి శివకృష్ణారెడ్డి, పోతుల మహేశ్వరరెడ్డి, షేక్ ఖలీం, విజయ్‌కుమార్, మల్లికార్జునరెడ్డి, ఫారూక్, మహబూబ్‌బాషా, చాకలి నాగరాజు, మాబాషా తదితరులకు సిద్దార్థరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యమని భావించి ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.


