కర్నూలు (టౌన్) : కర్నూలు నగరపాలక సంస్థ 15వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి మల్లికా సమయాకు రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా అద్యక్షుడు జి. స్వాములు కోరారు. నామినేషన్ల సమయంలో ప్రత్యర్థి టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని చంపుతామని బెదిరించడం, దౌర్జన్యాలకు పాల్పడ్డారని దీంతో అమె హైకోర్టును ఆశ్రయించారన్నారు. విచారణ జరిపిన హైకోర్టు ఈనెల 30వ తేదీ వన్ టౌన్ పోలీసులు అభ్యర్థికి రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు శనివారం స్థానిక వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో సీఐ మారుతి శంకర్‌కు హైకోర్టు ఉత్తర్వులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ మల్లికా సమయాపై టీడీపీకి చెందిన మహిళలతో భౌతిక దాడి చేయించారన్నారు. శివ నిఖిలేశ్వర రెడ్డి, మాజీ కార్పొరేటర్ జలీల్, ఆరిఫ్ ఖాన్ పాల్గొన్నారు.


