కేసులు, అరెస్టులకు భయపడొద్దు | - | Sakshi
Sakshi News home page

కేసులు, అరెస్టులకు భయపడొద్దు

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

● ప్రతి ఊరిలో నామినేషన్‌ పడాల్సిందే

● ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి

హొళగుంద: టీడీపీ నాయకుల వేధింపులు, పోలీసు కేసులు, అరెస్టులకు భయపడొద్దని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్ర తి ఊరులో నామినేషన్‌ వేయాలన్నారు. కార్యకర్తల కోసం మరోసారి జైలుకెళ్లడానికి కూడా సిద్ధమన్నారు. హొళగుందలో శనివారం వైఎస్సార్‌సీపీ కార్యకర్తల స మావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ‘కూటమి’ ఒత్తిళ్లకు తలొగ్గి ఏకగ్రీవలకు అవకాశం ఇస్తే ప్రజలకు మోసం చేసినట్టవుతుందన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలువుతోందని, ఎన్నికలను ఏకపక్షంగా జరుపుకోవడానికి టీడీపీ నాయకులు చేయని పనులు లేవన్నారు. వీటిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. చేయని తప్పుకు ఏ కేసులు లేని తనను 70 రోజులు జైలులో ఉంచారని, దీనికి సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ కారణమన్నారు. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడవద్దని, 2029లో జగనన్న సీఎం కావడం ఖాయమని అప్పుడు రెండింతలు అనుభవిస్తారన్నారు.

కొత్త పింఛన్లు ఏవీ?

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం సూపర్‌ సిక్స్‌ పేరిట హామిలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. రెండున్నరేళ్లు దాటినా నేటికీ ఒక్క కొత్త పింఛన్‌ ఇవ్వలేదన్నారు. మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగభృతి, 50 ఏళ్లకే పింఛన్‌ వంటి పథకాలు ఇప్పటి వరకు ఆమలు కాలేదన్నారు. నీళ్లు ఉన్నా ఇవ్వకపోవడంతో పంటలు పండక రైతులు ఈఏడాది తీవ్రంగా నష్టపోయారని, కనీసం పరిహారం కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. ప్రజలు ఓట్లు వేయరని పోలీసులను అడ్డు పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను ఏకపక్షంగా చేసేందుకు టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. అధికార పార్టీ వారు అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా నామినేషన్‌ వేయాలన్నారు. ప్రతి ఊరులో నామినేషన్‌ పడితే కచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ షఫీవుల్లా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి, నాయకులు ఈశా, శేషప్ప, కాకి ఫక్కీరప్ప, పాల్తూరు గోవిందు, ప్రహ్లాదరెడ్డి, మల్లి, నాగభూషణ్‌రెడ్డి, హనుమప్ప, వెంకటరెడ్డి, రామకృష్ణ, వెంకట్రామిరెడ్డి, పంపాపతి, మౌనేష్‌, అమరేష్‌, మంజు నాయక్‌, మల్లయ్య, షేక్షావలి, శ్రీనివాసరెడ్డి, దర్గన్న, చంద్ర, వెంకటేష్‌, మరిస్వామి, సిద్ధయ్య, యల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement