సమన్వయంతో పనిచేద్దాం | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేద్దాం

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

ఎన్నికల సామగ్రి పంపిణీ నుంచి కౌంటింగ్‌ వరకు ప్రతి దశలో ముందస్తు ప్రణాళికతో సమన్వయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కర్నూలు నగర శివార్లలోని ది అథేనా స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌, రిసెప్షన్‌, ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని ఏర్పా ట్లను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేసు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement