తాగునీటి సమస్యపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా? | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా?

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

● రెడ్‌బుక్‌ రాజకీయాలకు

త్వరలో చరమగీతం

● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విరూపాక్షి

సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు

ఆలూరు రూరల్‌: తాగునీటి సమస్యపై విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించినందుకు తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజకీయాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ఆలూరులో గురువారం వైఎస్సార్‌సీపీ మండల నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాజకీయ కక్షసాధింపు చర్యలకు భయపడేది లేదన్నారు. ఆలూరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి 70 రోజుల పాటు జైలు లో ఉంచారన్నారు. జూలై 25వ తేదీ ఆస్పరికి ముఖ్యమంత్రి వస్తున్నారని 24న విలేకరుల సమావేశం నిర్వహించి తాగునీటి సమస్యపై ప్రశ్నించినందుకు తనపై కక్షగట్టారన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తను కాపాడుకునేందుకు ఆగస్టు 2వ తేదీ వెళ్లగా అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అర్ధరాత్రి వందలాది పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి, కరెంటు తీసి, సీసీ కెమెరాలు, తలుపులు ధ్వంసం చేసి అరెస్టు చేశారన్నారు. జూలై 24న అప్పటి పత్తికొండ డీఎస్పీ ఫోన్‌లో ‘ప్రెస్‌మీట్‌ ఎలా పెట్టావు నీ అంతు చూస్తా’ అంటూ బెదిరించారన్నారు. త్వరలోనే ప్రజలు రెడ్‌బుక్‌ రాజకీయాలకు చరమగీతం పాడుతారన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

అన్ని స్థానాల్లో పోటీ

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదదన్నారు. సమావేశంలో మండల కన్వీనర్‌ మల్లికార్జున, వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు రామాంజనేయులు,చిన్న ఈరన్న,భాస్కర్‌ నాయుడు, వీరభద్రా రెడ్డి,శ్రీధర్‌ రెడ్డి నాయకులు వెంకటేశ్వర్లు, అనిల్‌రెడ్డి, ఎల్లప్ప, కిషోర్‌, నాగప్ప, ఉరుకుందు, నాగేంద్ర, శ్రీరాములు, తిక్కన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement