వైడబ్ల్యూసీఎస్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ | - | Sakshi
Sakshi News home page

వైడబ్ల్యూసీఎస్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌

Oct 16 2026 7:35 AM | Updated on Oct 16 2026 7:35 AM

● వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టారేణుక

ఎమ్మిగనూరుటౌన్‌: ఎమ్మిగనూరు వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(వైడబ్ల్యూసీఎస్‌)కి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చిందని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ సమన్వయకర్త బుట్టారేణుక పేర్కొన్నారు. చేనేత ఆస్తుల పరిరక్షణకు తాము చేసిన న్యాయపోరాటానికి ఫలితం వచ్చిందన్నారు. ఎమ్మిగనూరులో గురువారం వైడబ్ల్యూసీఎస్‌ సభ్యురాలు సరోజ, బుట్టాఫౌండేషన్‌ అధినేత బుట్టాశివనీలకంఠ తదితరులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైడబ్ల్యూసీఎస్‌ను నష్టాల్లో నడిచే ఆప్కోలో విలీనం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. దీంతో తాము సొసైటీ సభ్యురాలు సరోజతో హైకోర్టులో రిట్‌ వేయగా.. పాలకవర్గ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయన్నారు. చేనేత జౌళి శాఖ అధికారులు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. పాలకవర్గం ఉంటే సొసైటీ బాగుపడుతుందన్నారు. అధికారులు వెంటనే హైకోర్ట్‌ ఉత్తర్వులను అమలు చేయాలన్నారు.

ప్రజాస్వామ్యపద్ధతితో ఎన్నికలు

నిర్వహించాలి

ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యపద్ధతిలో నిర్వహించాలని బుట్టారేణుక సూచించారు. కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ యూత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్టాప్రతుల్‌, న్యాయవాది మల్లేష్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు కామర్తినాగేషప్ప, శివప్రసాద్‌, మీసాల నీలకంఠ, నజీర్‌అహమ్మద్‌, అల్తాఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement