ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు

Oct 18 2026 1:36 AM | Updated on Oct 18 2026 1:36 AM

కర్నూలు (అర్బన్‌): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పాటించాలని, విధుల్లో అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి ఆదేశించారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు–2026 నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారులు(ఆర్‌ఓలు), అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు(ఏఆర్‌ఓలు) నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్‌ పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఎదురయ్యే సమస్యలను, సంబంధిత నిబంధనలపై అవగాహనతో అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో పత్రాల్లోని వివరాలు, తేదీ, సమయాన్ని నిబంధనల ప్రకారం నమోదు చేసి, అవసరమైన వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలో గందరగోళానికి తావులేకుండా బాధ్యతలను ముందుగానే కేటాయించాలని ఆదేశించారు. ఓటరు గుర్తింపు విషయంలో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో ట్రైనింగ్‌ నోడల్‌ ఆఫీసర్‌, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ నరసింహారెడ్డి, ఆర్డీవోలు ఓబులేసు, సందీప్‌ కుమార్‌, జిల్లా పరిషత్‌ సీఈవో సుధాకర్‌ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement