కర్నూలు(సెంట్రల్): భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలని వామపక్షాల నాయకులు కోరారు. ఇండియా కూటమి పిలుపు మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకొ ని శుక్రవారం కర్నూలులో వామపక్ష పార్టీల ఆధ్వ ర్యంలో జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జ్ఞానేష్‌కుమార్ వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందో ళనలో నాయకులు కె. రామాంజనేయులు, కె.ప్రభాకర్ రెడ్డి మాట్లా డారు. భారతీయ జనతా పార్టీకి ఏజెంట్‌గా జ్ఞానేష్‌కుమార్ వ్యవహరించారని విమర్శలు చేశారు. ముగ్గురు సభ్యుల ఎన్నికల మండలిలో ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించినా సర్ కార్యక్రమాన్ని ఎలా చేపట్టారని ప్రశ్నించారు. కేవలం బీజేపీ వ్యతిరేక ఓటర్లను తొలగించడానికే ఇలా చేశారని విమర్శంచారు. సీపీఎం జిల్లా డి.గౌస్ దేశాయ్, సీసీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు టి. రామచంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, సీపీఎం, సీపీఐ నగర కార్యదర్శులు టి.రాముడు. పి.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.


