ఊర్లోకి ఎమ్మెల్యే పార్థసారథిని రానివ్వం | - | Sakshi
Sakshi News home page

ఊర్లోకి ఎమ్మెల్యే పార్థసారథిని రానివ్వం

Oct 3 2026 1:08 AM | Updated on Oct 3 2026 1:08 AM

● స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తాం ● పెద్దహరివాణం గ్రామస్తుల ఆందోళన ● రద్దయిన ఎమ్మెల్యే సభ

● స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తాం ● పెద్దహరివాణం గ్రామస్తుల ఆందోళన ● రద్దయిన ఎమ్మెల్యే సభ

ఆదోని: మండల హోదా కల్పించేంతవరకు పెద్దహరివాణం గ్రామంలోకి ఎమ్మెల్యే పార్థసారథిని రానివ్వబోమని ప్రజలంతా శుక్రవారం తెలిపారు. ‘పేదల సేవలో –2.0’ పేరిట గ్రామంలో గ్రామసభ నిర్వహించడానికి ఎమ్మెల్యే హాజరవుతారని తెలియడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తమ గ్రామంలోకి నాయకులెవ్వరూ ప్రవేశించకూడదు అని బోర్డు పెట్టినా ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. పెద్దహరివాణం మండల హోదాను రద్దు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా అధికారికంగా ప్రకటించి ఆ తర్వాత రద్దు చే యడం అన్యాయమని మండి పడ్డారు. గ్రామ ప్రజ ల అభిప్రాయాలను, ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బస్టాండ్‌ వద్దకు చేరుకున్న విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. ఉద్రిక్త పరిస్థితులను గమనించిన అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి నచ్చజెప్పి కార్యక్రమం రద్దుకు ఒప్పించినట్లు సమాచారం. చివరకు ఎమ్మెల్యే కార్యక్రమం రద్దయినట్లు అధికారులు గ్రామస్తులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు శాంతించి వెనుదిరిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరిస్థితి అదుపులోకి వచ్చింది.

నిరసనను మరింత ఉధృతం చేస్తాం

మండల హోదా విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే నిరసనను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. గ్రామ ప్రజల ఐక్యతను ప్రభుత్వం తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement