రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెంట్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెంట్‌ మృతి

Oct 3 2026 1:08 AM | Updated on Oct 3 2026 1:08 AM

హత్య కేసులో నిందితుల అరెస్టు

కర్నూలు: కర్నూలు బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాన్స్‌పోర్టు ఏజెంట్‌ కాటం మహేష్‌ (34) మృతిచెందాడు. నంద్యాల జిల్లా పగిడ్యా ల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మహేష్‌ కేశవగ్రాండ్‌ హోటల్‌ వెనుక ఉన్న ఎస్‌డీఆర్‌ఎల్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం మునగాలపాడు శివారులో ని వింటేజ్‌ గ్రీన్‌ఫీల్డ్‌లో నివాసముంటున్నాడు. గురువారం రాత్రి ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. 44వ నెంబర్‌ జాతీయ రహదారి బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై గుర్తు తెలియ ని వాహనం ఆయన బైకును ఢీకొట్టి వెళ్లింది. దీంతో ఆయన రోడ్డుపై పడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉన్న మహేష్‌ను స్థానికులు ప్రైవేటు అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో డాక్టర్లు పరీక్షించి శుక్రవారం తెల్లవారుజామున చనిపోయినట్లు నిర్ధారించారు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్‌ పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలున్నారు. భార్య పుణ్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోనెగండ్ల: హత్య కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. అరెస్ట్‌ చేసిన వారిని విలేకరులకు చూపించారు. అనంతరం హత్య వివరాలు వెల్లడించారు. గోనెగండ్లలోని లక్ష్మీపేటకు చెందిన రంగడు (40), అతని సోదరుడు వెంకటేష్‌ కలిసి సెప్టెంబర్‌ 30వ తేదీ ఉదయం గోనెగండ్ల గ్రామ సమీపంలో ఉన్న తమ పొలానికి వెళ్లారన్నారు. రోడ్డుపై తారుపట్టపై ఎరువుల మందును కలుపుతుండగా భానుచంద్ర, వెంకట్రాముడు ద్విచక్ర వాహనాన్ని దానిపై నడిపారన్నారు. దీంతో రంగడు, వెంకటేష్‌, భానుచంద్ర, వెంకట్రాముడుల మధ్య వాగ్వాదం జరిగిందని చెప్పారు. ఆగ్రహానికి లోనైన భానుచంద్ర పొలంలో ఉన్న ఇనుప చెలకతో రంగడు ఎదలపై బలంగా కొట్టడంతో వైద్యం కోసం ఎమ్మిగనూరుకు తీసుకెళ్తండగా మృతిచెందాడన్నారు. మృతుడి భార్య మహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భానుచంద్ర, వెంకట్రాముడుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం గాజులదిన్నె ప్రాజెక్టు స్టేజ్‌ దగ్గర పిల్లిగుండ్లకు వెళ్లేదారిలో వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

కాంగ్రెస్‌ జిల్లాల ఇన్‌చార్జ్‌ల నియామకం

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు కాంగ్రెస్‌పార్టీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఒక్కో జిల్లాకు సీనియర్‌ నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమి ంచింది. అందులో భాగంగా కర్నూలు జిల్లాకు పాణ్యం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా ఉన్న జే.లక్ష్మీనరసింహయాదవ్‌ను నియమించారు. అలాగే నంద్యాల జిల్లాకు గడ్డం పాల్‌ విజయకుమార్‌ను నియమించారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement