● గత ప్రభుత్వంలో సామాన్య భక్తులకు ఉచితంగా ఆర్జితసేవలు ● తెల్లరేషన్‌కార్డు కలిగిన భక్తులకు ప్రతినెల ఒక ఆర్జితసేవ ● ప్రతిసేవలో 250 మంది భక్తులు పాల్గొనే అవకాశం ● గత ట్రస్ట్‌బోర్డు నిర్ణయాన్ని తుంగలో తొక్కిన దేవస్థానం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు సామాన్య భక్తులను దగ్గర చేయడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ట్రస్ట్‌బోర్డు ఎన్నో మార్పులు చేపట్టింది. రాష్ట్రంలో తెల్లరేషన్‌కార్డు కలిగిన భక్తులకు ప్రతి మాసంలో ఒకసారి ఉచిత సామూహిక ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. అయితే గత ట్రస్ట్‌బోర్డు నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం రావడంతో ఉచితంగా ఆర్జిత సేవల కార్యక్రమానికి దేవస్థాన అధికారులు మంగళం పలికారు. శ్రీశైల భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు జరిగే నిత్య ఆర్జితసేవలను నిర్వహించుకునే ఆశ ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన సామాన్య భక్తులు చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం వైఎస్సార్‌సీపీ హయాంలో ఏర్పాటైన ట్రస్ట్‌బోర్డు తెల్లరేషన్‌కార్డు కలిగిన భక్తులకు ప్రతి నెలలో ఒక రోజు స్వామిఅమ్మవార్లకు నిర్వహించే ఆర్జిత సేవను ఉచితంగా నిర్వహించుకునేలా భక్తులకు అవకాశం కల్పించింది. 2023 ఏప్రిల్ 25వ తేదీ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భక్తులు ఆయా ఆర్జిత సేవల్లో ఉచితంగా పాల్గొనేందుకు 250 టికెట్లను అందుబాటులో ఉంచుతారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి. ఈ సేవలో దంపతులు లేదా ఒకరు పాల్గొనే అవకాశం కల్పించారు.
సామాన్య భక్తులకు వరంగా ఉండేది..
దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో నిర్వహించే కుంకుమార్చన, మృత్యుంజయహోమం, శ్రావణ వరలక్ష్మీ వ్రతములు, గణపతిపూజ, చండీహోమం, శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్రహోమం, శ్రీవల్లీదేవసేన సమే త సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల కల్యాణోత్సవం తదితర ఆర్జిత సేవలను సామాన్య భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఆర్జిత సేవల నిర్వహణ అనంతరం సేవాకర్తలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా మల్లికార్జున స్వామివారి అలంకార దర్శనం, భ్రమరాంబాదేవి అమ్మవారి దర్శనంతో పాటు వృద్ధమల్లికార్జున స్వామివారి స్పర్శదర్శనం కల్పించబడింది. సేవాకర్తలకు 2 లడ్డూ ప్రసాదాలు, కుంకుమ, విభూతి, కై లాసకంకణాలు, శ్రీశైలప్రభ, కాటన్ కండువా, రవిక వస్త్రం అందజేశారు.
రెండేళ్లుగా ఆర్జిత సేవలు దూరం..
2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దేవస్థానాల్లో జరుగుతున్న పూజా కా ర్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని ప్రక టించింది. కొందరు పాలకులు హిందూ ధర్మానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం, సనాతని అని.. ప్రగల్బాలు పలికారు తప్పా ఆచరణలో మాత్రం ఆదిశగా చర్యలు తీసుకోలేదు. గతంలో ప్రవేశపెట్టిన సేవలను సైతం రద్దు చేయడంపై హిందూధర్మంపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఎంటో ఇట్లే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక శ్రీశైల దేవస్థానంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం జరుగుతున్న ఉచిత ఆర్జిత సేవ కార్యక్రమాన్ని రద్దు చేసింది. దీంతో గత రెండు సంవత్సరాలకు పైగా సామాన్య భక్తులు ఉచిత ఆర్జిత సేవలకు దూరంగా ఉంటున్నారు. ట్రస్ట్‌బోర్డు ఏర్పాటైనప్పటికీ కూడా సామాన్య భక్తుల అవసరాలపై దృష్టి సారించలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై న కూటమి ప్రభుత్వం, శ్రీశైల దేవస్థాన అధికారులు స్పందించి సామాన్య భక్తుల సౌకర్యార్థం గత వైఎస్సార్‌సీపీ ట్రస్ట్‌బోర్డు ప్రవేశపెట్టిన ఉచిత ఆర్జిత సేవను ప్రవేశపెట్టాలని పలువురు భక్తులు కోరుతున్నారు.


