బండిఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జి.శ్రీనివాసులు 2012లో జూనియర్ లెక్చరర్ల నియామకంలో స్టేట్ టాపర్‌గా నిలిచారు. అప్పటి నుంచి 2021 సంవత్సరం వరకు మిడుతూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. 2021లో కర్నూలు నగరంలోని కెవిఆర్ బాలికల జూనియర్ కాలేజీకి బదిలీపై వచ్చారు. ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేసి సేవా దృక్పథాన్ని పెంపొందించారు. అత్యుత్తమ ఫలితాలతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా బోధన సాగిస్తున్నారు. కేవీఆర్ కాలేజీలో పని చేస్తున్న ఓ చిరుద్యోగి కిడ్నీలు పాడై చికిత్సకు ఇబ్బంది పడుతుండటంతో కొంత సొమ్ము వసూలు చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. గతేడాది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. – కర్నూలు సిటీ


