డోన్: జగదుర్తి గ్రామంలో మూడు రోజుల క్రితం టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. టీడీపీ నాయకులు రాజేశ్వరరెడ్డి, ఆయన అనుచరులు 26వ తేదీన రాత్రి అదే గ్రామానికి చెందిన రామ్మెహన్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపై మారణాయుధాలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని బుగ్గన పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన వెంట ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సోమేష్ యాదవ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఎద్దుల గజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ తిరుమాంపల్లి తిరుమల్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు బద్దల రాజ్‌కుమార్, నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ దొరపల్లి చిరంజీవి, జగదుర్తి గ్రామ నాయకులు సురేష్, మసాల రంగడు ఉన్నారు.
కొనసాగుతున్న బిల్ కలెక్టర్ల దీక్షలు
తిరుపతి రూరల్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ట్రాన్స్‌కో బిల్ కలెక్టర్లు చేస్తున్న రిలే, నిరాహార దీక్షలు శుక్రవారం 12వ రోజుకు చేరాయి. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం చేస్తామని బిల్ కలెక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ స్పష్టం చేశారు. వీరి దీక్షలకు ఏపీ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షులు నయాబ్ రసూల్, డి.సూరిబాబు తదితరులు సంఘీభావం తెలిపారు. దీక్షల్లో కర్నూలు జిల్లాకు చెందిన విద్యుత్తు బిల్ కలెక్టర్లు పాల్గొన్నారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో యువకుడికి జైలు శిక్ష
నంద్యాల(వ్యవసాయం): డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన యువకుడికి స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ న్యాయమూర్తి మద్దెల శ్రీనివాసరెడ్డి శుక్రవారం జైలు శిక్ష విధించారు. మద్యం మత్తులో బైక్ నడుపుతూ పట్టుడిన మహేంద్రపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి మూడు రోజులు సాధారణ జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.


