ఈ చిత్రంలో ఉన్నది వందవాసి హరిప్రియ. గూళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. రాయలసీమ మహా కవి సమ్మేళనంలో పాల్గొని కవితా గానం చేశారు. టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన సంక్రాంతి వైభవం కవి సమ్మేళనంలో పాల్గొని సమకాలీన అంశాలపై కవిత వినిపించారు. రాగయుక్తంగా ఆలపించిన పద్యాలు కొన్ని వివిధ యూట్యూబ్ చానల్స్‌లో వైరలయ్యాయి. సాహిత్యంపై మక్కువతో రాసిన కవితలు వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యాయి. వెంకట నరేంద్ర ప్రసాద్ సీమ గొంతుకకు, ప్రముఖ బాల సాహితీ వేత్త డాక్టర్ హరికిషన్ చందమామ చెప్పిన కథలు ఇలా అనేక పుస్తకాలను సమీక్ష చేసి ప్రశంసలు అందుకున్నారు. నరసరావు పేటలో జరిగిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీల్లో పద్యాల విభాగంలో బహుమతి అందుకున్నారు. ఆధునికత, సాంకేతికత ప్రవాహంలో తెలుగు భాషా వైభవం తగ్గకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటున్నారు వందవాసి హరిప్రియ.


