సమస్యలు అప్‌గ్రేడ్‌! | - | Sakshi
Sakshi News home page

సమస్యలు అప్‌గ్రేడ్‌!

Jul 24 2026 1:09 AM | Updated on Jul 24 2026 1:09 AM

పెచ్చులూడిన పైకప్పు

నిరుపయోగంగా ఉన్న టీవీ

విరిగిపోయి పగలే వెలుగుతున్న ఎల్‌ఈడీ లైటు

టీవలే ప్రాథమికోన్నత నుంచి ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్‌ అయిన నెరణికి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఈ పాఠశాలలో 320 మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. మొత్తం 11 మంది టీచర్లు పాఠాలు చెబుతున్నార. ఈ పాఠశాలలో తరగతి గదుల పైకప్పులు పెచ్చలూడి ప్రమాదకరంగా మారాయి. పాఠశాల భవనం, కాంపౌండ్‌ వాల్‌ మధ్యలో పిచ్చి మొక్కులు పెరిగి విష కీటకాలకు తిరుగుతున్నాయి. ఇష్టారాజ్యంగా కుక్కలు సంచరిస్తుండగా.. గోడకు బిగించిన లైటు విరిగిపోయి పగలే వెలుగుతోంది. తరగతి గదిలో బోధన కోసం ఉన్న సుమారు రూ.లక్ష వరకు విలువ ఉన్న ఐఎఫ్‌బీ ప్యానల్‌ (ఎల్‌ఈడీ టీవి) స్క్రీన్‌ పగిలి పోయింది. ఈ విషయంలో పాఠశాలలోని ఓ టీచరుకు వివరణ కోరుతూ షోకాజు నోటీసు కూడా ఇచ్చినట్లు ఎంఈఓ– 1 సుధారాణి తెలిపారు. – హొళగుంద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement