కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలి

Jul 2 2026 12:47 PM | Updated on Jul 2 2026 12:47 PM

11న జాతీయ లోక్‌ అదాలత్‌

కర్నూలు: కోర్టులలో పెండింగ్‌లోని రాజీ కాదగిన క్రిమినల్‌, ఎకై ్సజ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు, ఎకై ్సజ్‌ అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచించారు. జిల్లా న్యాయ సేవా సదన్‌లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులు, సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌లు, ఎకై ్సజ్‌ అధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి బుధవారం సమీక్ష నిర్వహించారు. జాతీయ లోక్‌ అదాలత్‌ ఈనెల 11న నిర్వహిస్తున్నందున అందులో ఎక్కువ కేసులు పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు కూడా వినియోగించుకుని వారి కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. ఎకై ్సజ్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ అనిల్‌కుమార్‌, రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి సరోజనమ్మ, మొబైల్‌ కోర్టు మెజిస్ట్రేట్‌ అనూష, ఒకటో అదనపు మెజిస్ట్రేట్‌ అపర్ణ, ఉమ్మడి జిల్లాల సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్లు, కర్నూలు, నంద్యాల అడిషనల్‌ ఎస్పీలు హుసేన్‌ పీరా, ఖాదర్‌ బాషా, ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సుధీర్‌ బాబు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement