ఆదోనిలో అద్దెకు ఎస్సీ కార్పొరేషన్‌ షాపులు | - | Sakshi
Sakshi News home page

ఆదోనిలో అద్దెకు ఎస్సీ కార్పొరేషన్‌ షాపులు

Jul 2 2026 12:47 PM | Updated on Jul 2 2026 12:47 PM

దరఖాస్తుకు ఈ నెల 7వ తేదీ ఆఖరు

కర్నూలు(అర్బన్‌): ఆదోనిలోని పోలీస్‌ కంట్రోల్‌రూం సమీపంలోని ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని 12 షాపులను ఎస్సీ నిరుద్యోగ యువతకు అద్దెకు కేటాయించనున్నట్లు ఎస్‌సీ కార్పొరేషన్‌ ఈడీ కె.తులసీదేవి తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగి 18 నుంచి 60 సంవత్సరాల్లోపు ఎస్సీ కులస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా షాపుల్లో గతంలో ఎవరైతే యూనిట్‌ నిర్వహస్తున్నారో వారికి ప్రాధాన్యతనిస్తామని, దరఖాస్తు సమయానికి అద్దె బకాయిలు చెల్లిస్తేనే అర్హులన్నారు. అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. ప్రతి షాపునకు రూ.5వేలు అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తులను కర్నూలులోని బిర్లాగేట్‌ సమీపంలోని ఎస్‌సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఈ నెల 7వ తేదిలోగా అందజేయాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement