కర్నూలు(సెంట్రల్): కేంద్రం ప్రభుత్వం 2019లో తెచ్చిన వినియోగదారుల రక్షణ చట్టంతో వ్యాపారులు చేసే మోసాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం.రాజారఘువీర్ తెలిపారు. ఆదివారం వినియోగదారుల కోర్టులో వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిన దినాన్ని పురస్కరించుకొని సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో చిన్న వస్తువును కొనుగోలు చేసినా బిల్లును తీసుకోవాలని సూచించారు. తద్వారా ఆ వస్తువు నకలిదీ అయినా, నాణ్యత లేకున్నా మోసాన్ని నివారించేందుకు వీలు ఉంటుందన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు కరణం కిశోర్‌కుమార్, సభ్యురాలు నజ్మా కౌసర్ మాట్లాడుతూ.. వినియోగదారుల సేవలు లేదా వస్తువు కొనుగోలు మోసం జరిగితే వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాలని సూచించారు. 1915 అనే టోల్ నంబర్‌కు నేరుగా వినియోగదారుల కమిషన్లలో ఫిర్యాదు చేయవచ్చున్నారు. మరో కమిమిషన్ సభ్యుడు నారాయణరెడ్డి మాట్లాతూ.. ఆన్‌లైన్ కొనుగోళ్లలోనే ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయని, బిల్లులు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, నదీంహుస్సేన్, శివమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


