కల్లూరు: నిరక్షరాస్యత నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిందని జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి అన్నారు. ఆదివారం కల్లూరు మండలం చిన్నటేకూరు, తడకనపల్లె గ్రామాలోని పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వయోజనులు చదవడం, రాయడం నేర్చుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 2029 నాటికి వందశాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగశేషాచలరెడ్డి, ఎపిఎం పుష్పావతి, తదితరులు పాల్గొన్నారు.
క్వింటా వేరుశనగ రూ.9,290
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు ఆదివారం 3,574 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులు విక్రయానికి వచ్చాయి. క్వింటాకు గరిష్టంగా రూ.9,290 ధర లభించిందని మా ర్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్ర మౌళి తెలిపారు. కనిష్ట ధర క్వింటా రూ. 3,461, మధ్యస్థ ధర క్వింటా రూ.7,120 పలికినట్లు పేర్కొన్నారు. ఆముదాలు 88 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటం రూ. 2,520, మధ్యస్థ ధర క్వింటం రూ.5,811,గరిష్ట ధర రూ.5,904 , కందులు 6 క్వింటాళ్లు వి క్రయానికి రావడంతో వాటిలో క్వింటం కనిష్ట ధర రూ.6,520, మధ్యస్థ ధర రూ.6,869, గరిష్ట ధర రూ.7,029 పలికిందన్నారు.
పేకాట స్థావరంపై
పోలీసుల దాడి
ఆస్పరి: ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు గ్రామ సమీపంలో ఆదివారం స్పెషల్ పార్టీ పోలీసులు పేకాట స్థావరంపై మెరుపు దాడి చేశారు. ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపిన వివరా లు మేరకు.. ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలకు చెందిన విరూపాక్షి, రామకృష్ణతో పాటు మరో 16 మంది వ్యక్తులు చిన్నహోతూరు గ్రామ సమీపంలో పేకాట ఆడుతుండగా దాడు లు చేసి అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.5.30 లక్షలు స్వాధీనం చేసుకుని 17 సెల్‌ఫోన్లు, 8 బైకులు సీజ్ చేశామన్నారు. ఎక్క డైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్ప డితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదన్నారు.


