మహానంది: పరిమితికి మించి ప్రయాణం ప్రమాదకర మని ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు. ఒకటి కాదు రెండు కాదు వేలాది కిలో మీటర్ల దూరం నుంచి చిన్న చిన్న వాహనాల్లో అధిక సంఖ్యలో కూర్చుని ప్రయాణాలు చేస్తున్నారు. ఉగాది సమీపిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వేలాది మంది భక్తులు శ్రీశైలం, మహానంది, ఉరుకుంద ఆలయాలకు వస్తున్నారు. అందులో చాలా మంది చిన్న చిన్న వాహనాల్లో ఇలా పరిమితికి మించి కూర్చు ని ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. మహానందిలో ఆదివారం సాయంత్రం ఈ దృశ్యం కనిపించింది.


