ఆఫర్ల పేరుతో సైబర్‌ మోసాలు | - | Sakshi
Sakshi News home page

ఆఫర్ల పేరుతో సైబర్‌ మోసాలు

Mar 16 2026 7:31 AM | Updated on Mar 16 2026 7:31 AM

బాబూ.. పెద్దాసుపత్రికి వెళ్లొద్దు

తెలంగాణ వాళ్లమని వెళ్లిపొమ్మంటున్నారు

ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఏమీ చేయలేం

కర్నూలు: ఉగాది, రంజాన్‌ పండుగల సందర్భంగా భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్ల పేరుతో సైబర్‌ నేరగాళ్లు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్‌ మీడియా, మెసేజ్‌లు, వాట్సాప్‌ లింక్‌ల ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్లు పంపించి బ్యాంకు వివరాలు, ఓటీపీ తీసుకొని డబ్బులు దోచుకునే ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతా వివరాలు, కార్డు వివరాలు, ఓటీపీలను చెప్పరాద ని హెచ్చరించారు. తెలియని యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేయడంతో మొబైల్‌లోని డేటా దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలు ఎవరైనా సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

శ్రీశైలం చేరుకున్న

పుదుచ్చేరి సీఎం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు పుదు చ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి ఆదివారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. ఈయనకు భ్రమరాంబా అతిథిగృహం వద్ద దేవస్థాన ఈఓ, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సోమవారం ఉదయం మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని పుదుచ్చేరి సీఎం దర్శించుకుంటారని దేవస్థాన అధికారులు తెలిపారు.

నేడు ‘డయల్‌ యువర్‌

సీఎండీ, ఎస్‌ఈ’

కర్నూలు(అగ్రికల్చర్‌): ఏపీఎస్‌పీడీసీఎల్‌ ప్రధా న కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్‌ యువర్‌ ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్ర మం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని కర్నూలు సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ఆర్‌.ప్రదీప్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్‌ భవన్‌లో కూడా సోమవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు 7382614308 నంబరుకు ఫోన్‌చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

ఆస్తి పన్ను వసూళ్లు

రూ. 64.32 కోట్లు

కర్నూలు (టౌన్‌): నగరపాలక సంస్థ పన్ను వసూళ్లు ముమ్మరం చేసినట్లు నగరపాలక కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఇప్పటి వరకు ఆస్తి పన్ను రూ. 64. 32 కోట్లు, నీటి పన్ను రూ. 6.74 కోట్లు వసూళ్లు అయినట్లు తెలిపారు. నగరంలోని పలు వార్డు సచివాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని, వీటిలో పన్నులు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతిరోజూ రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ప్రతిరోజూ 3 వేల నుంచి 3,500 ఓపీ రోగులు, 1200 నుంచి 1500 ఐపీ రోగులు చికిత్స పొందుతున్నారు. వాస్తవంగా ఇది 1,050 పడకల ఆసుపత్రి. గత ప్రభుత్వంలో దీని సామర్థ్యాన్ని 1,500 పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలు ముందుకు సాగుతుండగా ఎన్నికలు సమీపించాయి. దీంతో ఈ అంశం అటకెక్కింది. అయినా కూడా అప్పట్లో 1,500 పడకలకు అవసరమైన బడ్జెట్‌ను ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేది. కానీ ఇప్పుడు కేవలం 1,050 పడకలకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారు. నిధుల లేమితో ఆసుపత్రి ఇబ్బందులు పడుతోంది. మరోవైపు ఆరోగ్యశ్రీ నిధులు సైతం ఆగిపోవడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఖరీదైన మందులు

కొనుగోలు చేయాల్సిందే!

ప్రైవేటు ఆసుపత్రుల్లో మాదిరిగానే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కూడా ఆరోగ్యశ్రీ(డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ వైద్యసేవ) పథకం ద్వారా ఇక్కడ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ఉచితంగా వైద్యం అందించే కేంద్రం. కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంటేనే ఉచిత వైద్యం అనే రీతికి తీసుకొచ్చారు. ఈ ఆసుపత్రిలో దాదాపుగా 90 శాతం రోగులు ఆరోగ్యశ్రీ కార్డుపైనే చికిత్స పొందుతున్నారు. ఈ కార్డు లేకపోతే వారు చేతి నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కొన్ని వ్యాధులకు ఆసుపత్రిలో ఉన్న మందులు ఇచ్చి వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే అధికారులే బయట కొనుగోలు చేసి రోగులకు అందించే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు కార్డులేని వారు ఆ మందులను డబ్బులు ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చు చేయలేని ప్రభుత్వానికి చెందిన నాల్గవ తరగతి ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే చిరుద్యోగులు, వ్యాపారులు చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఈ ఆసుపత్రిలో ఇలాంటి రోగులకు వైద్యులు, వైద్య సిబ్బంది చికిత్స మాత్రమే ఉచితం. ఖరీదైన మందులు, ఇన్‌ప్లాంట్స్‌, స్టెంట్స్‌, ఆపరేషన్‌కు అవసరమయ్యే ఇతర పరికరాలు కొనుగోలు చేయాల్సిందే.

ఇతర రాష్ట్రాల వారికి మరీ ఇబ్బంది

కర్నూలు మీదుగా రెండు జాతీయ రహదారులు, రెండు రాష్ట్ర రహదారులు వెళ్తున్నాయి. ఈ క్రమంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో క్షతగాత్రులను ఈ ఆసుపత్రికే చికిత్స నిమిత్తం తీసుకొస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇతర రాష్ట్రాల వారు ఉంటే వారు చికిత్సకు చేతి నుంచి డబ్బులు ఖర్చు చేయాల్సిందే. అయితే వారి వద్ద ఎవ్వరూ లేకపోతే ఆసుపత్రి అధికారులు ఉచితంగా వైద్యం అందేలా చేస్తున్నారు. వారి వద్ద ఎవ్వరైనా ఉంటే మాత్రం జేబు నుంచి కొంత మొత్తం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి ఈ ఆసుపత్రిపై, వైద్యులపై నమ్మకంతో ఎక్కువ మంది చికిత్స కోసం వస్తుంటారు. వారి ఆరోగ్య కార్డులు ఇక్కడ చెల్లుబాటు కావు. ఈ కారణంగా ఇలాంటి వారు సైతం వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు మినహా, ఖరీదైన మందులు, ఆపరేషన్‌కు అవసరమైన సర్జికల్స్‌, పరికరాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. లేకపోతే వారి రాష్ట్రాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని వైద్యులు తెగేసి చెబుతున్నారు.

ఉచితం కాకపోతే

ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు?

ప్రభుత్వ ఆసుపత్రి అంటే దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యం అందించాలి. భారత పౌరులకు ఇది ప్రాథమిక హక్కు. మనిషికి ప్రభుత్వాలు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది. ఇది ఏ రాష్ట్రానికై నా వర్తిస్తుంది. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు, అది కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే పూర్తి ఉచితంగా వైద్యం చేస్తామని కొర్రీలు పెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి, ఇతర రాష్ట్రాల వారికి ఉచితంగా వైద్యం ఎలా చేయాలో ఆయా రాష్ట్రాల పాలకులు, అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఉచిత వైద్యం అందించే పరిస్థితి లేదనడం ఎంతవరకు న్యాయమని రోగులు ప్రశ్నిస్తున్నారు.

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో

ముందులు కొనాల్సిందే!

ఆపరేషన్లకు ఖర్చు తడిసిమోపెడు

ఆరోగ్యశ్రీ కార్డు లేనివారికి,

ఉద్యోగులకు తిప్పలు

తెలంగాణ, కర్ణాటక వాసులకు

ఇంకా ఇబ్బంది

వైద్యుల చికిత్స మాత్రమే

ఇక్కడ ఉచితం

ప్రభుత్వ ఆసుపత్రి అంటే కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా ఉచిత వైద్యం అందించే ఆరోగ్య కేంద్రం. కానీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందుతోంది. అది లేని వారి జేబుకు భారీ చిల్లు పడుతోంది. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది వైద్యసేవలు మాత్రమే ఉచితం. మందులు, ఆపరేషన్‌కు అవసరమైన ఇన్‌ ప్లాంట్స్‌, స్టెంట్స్‌ వంటివన్నీ కొనుగోలు చేయాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సరిగ్గా కేటాయించకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. దీంతో ‘బాబూ.. పెద్దాసుపత్రికి వెళ్లొద్దు’ అని ప్రజలు అంటున్నారు.

మాది తెలంగాణ రాష్ట్రం. కర్నూలు జిల్లా సరిహద్దులోని రాజోలి గ్రామం. నాకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు డ్రైవర్‌గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మా తరతరాలుగా వైద్యం కోసం కర్నూలుకే వస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందని, నాకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదంటున్నారు. నాకు నడుములో వెన్నుపూసలు అరిగిపోవడంతో ఆపరేషన్‌ అవసరమైంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉచితంగా వైద్యం చేయలేమని, హైదరాబాద్‌కు వెళ్లాలని వైద్యులు చెబుతున్నారు. మేము పేదవారం. హైదరాబాద్‌కు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత మాకు లేదు. వైద్యం చేయాలని డాక్టర్లను వేడుకుంటున్నా వినడం లేదు. – కె.శివమ్మ, రాజోలి, తెలంగాణ రాష్ట్రం

ఆసుపత్రిలో రోగులకు చికిత్స పూర్తిగా ఉచితం. అయితే ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి వైద్యుల సేవలు, ఆసుపత్రిలో ఉన్న మందులు అందిస్తున్నాం. ఆపరేషన్‌కు అవసరమైన ఇన్‌ప్లాంట్స్‌, స్టెంట్స్‌ వంటివి రోగులే కొనుగోలు చేయాలని చెబుతున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇలాంటివి ప్యాకేజీలో వస్తాయి కాబట్టి మేమే కొనుగోలు చేసి ఇస్తాం. కార్డు లేకపోతే అందరికీ కొనుగోలు చేసి ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి బయట కొనుగోలు చేసుకుని తెస్తే ఆపరేషన్‌ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. – డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు,

సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement