నేడు లైలతుల్‌ ఖదర్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు లైలతుల్‌ ఖదర్‌

Mar 16 2026 7:31 AM | Updated on Mar 16 2026 7:31 AM

● ముస్లింలకు అత్యంత పవిత్రమైన రాత్రి ● మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు

● ముస్లింలకు అత్యంత పవిత్రమైన రాత్రి ● మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు

ఆదోని సెంట్రల్‌: రంజాన్‌ ముస్లింలకు అత్యంత పవిత్రమాసం. కఠోర ఉపవాస దీక్షలతో పగలు, రాత్రి తేడా లేకుండా అల్లా స్మరణలో గడుపుతారు. ఈ మాసంలో వచ్చే ప్రత్యేకమైన రాత్రి లైలతుల్‌ ఖదర్‌. దీన్నే ’బడీరాత్‌’ అని కూడా పిలుస్తారు. ఈ రోజునే ముస్లింల ఆరాధ్య దైవ గ్రంథం దివ్యఖురాన్‌ అవతరించిందని చెబుతారు. అందుకే ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలకు, ఖురాన్‌ పఠనానికి, దానధర్మాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. తెలిసీ తెలియక చేసిన తప్పులను తమ ప్రత్యేక ప్రార్థనలతో అల్లా క్షమిస్తారని నమ్మకం. దీంతో రాత్రంతా పశ్చాత్తాప భావనతో దైవ సన్నిధిలో గడుపుతారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వెయ్యికి పైగా మసీదులున్నాయి. నేడు లైలతుల్‌ ఖదర్‌ సందర్భంగా వాటిల్లో రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇషా నమా జ్‌ తర్వాత జరిగే ఈ ప్రార్థనల్లో ఆధ్మాతిక వేత్తల ప్రసంగాలు, పవిత్ర ఖురాన్‌ పఠనం, జికర్‌, తహజు ద్‌ నమాజ్‌ చేస్తూ రాతంత్రా జాగరం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement