యువకుడి బలవన్మరణం
కోవెలకుంట్ల: స్థానిక ఎల్‌ఎం కాంపౌండ్‌కు చెందిన ఓ యువకుడు గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన రామారావు కుమారుడు రంగస్వామి(21) పట్టణంలో చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. ఉదయం తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన యువకుడు ఉరి వేసుకున్నాడు. తల్లి ఇంటికి వచ్చి తలుపు తీసి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతున్నాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కిందకు దించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


