వ్యాయామం తప్పనిసరి
మధుమేహం అనేది కేవలం చక్కెర స్థాయిల సమస్య మాత్రమే కాదు. శరీరంలో వాత దోషం అసమతుల్యతతో వస్తుంది. దీని నివారణకు ఆహారంలో మార్పులు, వ్యాయామం, మూలికల వాడకం వంటి సమగ్ర విధానాన్ని సూచిస్తాం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయలు, మెంతులు, దాల్చిన చెక్క, పసుపు వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఆయుర్వేద చికిత్సలో ఈ వ్యాధిని నియంత్రించేందుకు ఆహార మార్పులు, వ్యాయామం, మూలికల కలయికను సూచిస్తాం.
–డాక్టర్ వెంకటనాగరాజ పాల, ఆయుర్వేద వైద్యులు, కర్నూలు


