
పండుగను సోదరభావంతో జరుపుకోవాలి
● ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు: వినాయక చవితి పండుగను బుధవారం సోదరభావంతో జరుపుకోవాల ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సోమవారం వివిధ మతాలు, కులాల పెద్దలతో శాంతియుత సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయవద్ధని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలను అమర్చుకునే విధంగా చూడాలన్నారు. కర్నూలు నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా సహకరించాలన్నారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, పార్థసారధి, విక్రమ సింహ, నాగరాజరావు, తబ్రేజ్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మత పెద్దలు, ప్రభుత్వ ఖాజీ సయ్యద్ అబ్దుల్ సలాం, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వేణు గోపాల్, గోరంట్ల రమణ, మౌలానా అబ్దుల్ ఖదీర్, మిలాద్ కమిటీ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ షఫీ బా షా ఖాద్రి, జామియా మసీదు ధర్మకర్త బాసు మియ, ప్రతాప్‌రెడ్డి, పూల రంగస్వామి, మద్దిలేటి, జోగయ్య శర్మ, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.