
స్వాగతం
కర్నూలు(సెంట్రల్): ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్.హరినాథ్ కర్నూలుకు వచ్చారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో కలెక్టర్ పి.రంజిత్‌బాషా కలసి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిస్థితులపై చర్చించుకున్నారు.
మిత్రుల మానవత్వం
కర్నూలు(అగ్రికల్చర్): 2022 సంవత్సరం డిసెంబర్ 2న క్యాన్సర్‌తో మరణించిన మిత్రుడి కుటుంబం పట్ల చిన్ననాటి స్నేహితులు మానవత్వం చూపారు. కర్నూలు మండ లం చిన్నబాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ 2002–03లో బ్రాహ్మణకొట్కూరులో 10వ తరగతి చదివారు. ఈయన మొబైల్ షాపులో మెకానిక్‌గా పనిచేస్తూ క్యాన్సర్ బారిన పడి మరణించారు. భార్య, ముగ్గురు కూతుళ్లు సంతానం. మరణించిన మిత్రుడి కుటుంబానికి 10వ తరగతి బ్యాచ్ స్నేహితులు చందాల ద్వారా రూ.54 వేలు పోగుచేశారు. ఈ మొత్తాన్ని కర్నూలులోని కింగ్‌మార్కెట్ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శాఖలో మరణించిన రామకృష్ణ భార్య పేరిట డిపాజిట్ చేశారు. శుక్రవారం మిత్ర బృందం చిన్నబాపురం గ్రామానికి వెళ్లి తమ స్నేహితుని పిల్లలకు బట్టలు అందచేశారు. మిత్రుడి పట్ల మానవత్వం చూపడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
బానకచర్ల నుంచి 26 వేల క్యూసెక్కులు విడుదల
పాములపాడు: బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి శుక్రవారం 26,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు నుంచి ఎస్‌ఆర్‌ఎంసీ ద్వారా 26,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందన్నారు. తెలుగుగంగ(వీబీఆర్)కు 11,000, జీఎన్‌ఎస్‌ఎస్‌కు 12,000, కేసీసీ ఎస్కేప్ చానల్‌కు 3,000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు వివరించారు.
మహానందిలో మహాలక్ష్మీ హోమాలు
మహానంది: శ్రావణమాసం మూడవ శుక్రవారం పురస్కరించుకుని మహానంది క్షేత్రంలో మహాలక్ష్మి హోమాలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు స్థానిక యాగశాలలో మహాలక్ష్మీ హోమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల భక్తులు ఆర్జిత సేవా టికెట్ల ద్వారా హోమంలో పాల్గొన్నారు. హోమాల అనంతరం భక్తులకు శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వారి ప్రసాదా లు అందించారు. శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి నెమలి పింఛములతో అలంకరణ చేశారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పండితులు, అర్చకులు అమ్మవారికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు అమ్మవారి అలంకరణ చూసి మంత్రముగ్ధుల య్యారు. శ్రావణమాసం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో ఆలయానికి వచ్చారు. స్వామి అమ్మ వార్లను దర్శించుకుని పూజలు చేపట్టారు. స్థానిక కల్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. రాత్రి యాగశాలలో మహానందీశ్వరుని దంపతులకు ఏకాంత సేవ పూజలతో దర్శనం సేవలు ముగిశాయి.

స్వాగతం

స్వాగతం

స్వాగతం