
ఉప్పలపాడులో యువకుడి ఆత్మహత్య
ఓర్వకల్లు: ఉప్పలపాడు గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని గ్రామానికి చెందిన శ్రీనివాసులు భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. కాగా మొదటి భార్య కూతురు నందిని బేతంచెర్ల నుంచి వచ్చి ఉప్పలపాడులో నివాసముంటున్న తలారి సునీల్‌కుమార్ (21)తో ఏడాది క్రితం ప్రేమించి పెళ్లిచేసుకోంది. సునీల్ కొంతకాలంగా జులాయిగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతని భార్య నందిని కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. అయితే మూడు రోజుల క్రితం సునీల్ భార్య వద్దకు వెళ్లగా మామ, అల్లుడి మధ్య ఘర్షణ జరిగి శ్రీనివాసులు అల్లుడిపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన సునీల్ గురువారం తన సొంతింటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్ కుమార్ తెలిపారు.